సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన 13వ సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ కుహనా మత తత్వ పార్టీలకు బదులుగా ఎవరు ఊహించని రీతిలో మన భారత్ కు కాస్త అనుకూలమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఛైర్మన్ తారిఖ్‌ రెహమాన్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన గెలిచినా వెంటనే అభినందిస్తూ ప్రధాని మోడీ మొదటి ఫోన్ కాల్ చెయ్యడం గమనార్హం. సుమారు 17 ఏళ్లు విదేశాల్లో ఉండి వచ్చాక స్వదేశానికి తిరిగి వచ్చిన తారిఖ్‌ రెహమాన్‌, ఫిబ్రవరి 17న (మంగళవారం) ఢాకాలోని పార్లమెంటు హౌస్ ‘సదరన్ ప్లాజా’లో పదవీ ప్రమాణం చేయనున్నారు. తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ అధికారికంగా ఆహ్వానం పంపింది. భారత్‌తో పాటు చైనా, పాకిస్థాన్, సౌదీ అరేబియా సహా మొత్తం 13 దేశాల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే, అదే సమయంలో ముంబైలో ఫ్రెంచ్ అధ్యక్షుడితో చర్చలు, ఢిల్లీలో ‘AI సమ్మిట్’ వంటి ముందస్తు కార్యక్రమాల వల్ల ప్రధాని మోదీ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశంపై ఇంకా స్పష్టత రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *