సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ( 10వ తరగతి పేపర్ లీక్ వ్యవహారం లో ?) కేసు పెట్టి అరెస్ట్ చెయ్యడం తో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు నిరసనలు తెలియజేస్తున్నారు, కారణం చెప్పకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలో బండి అరెస్ట్‌పై తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు కేంద్రమంత్రి ఫోన్ చేశారు. బండి సంజయ్ అరెస్టుకు కారణాలేంటని డీజీపీని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కారణం చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని అడిగారు. అయితే కేసు వివరాలు కాసేపటి తర్వాత తెలియజేస్తామని డీజీపీ సమాధానమిచ్చారు. అంటే.. ఏ కేసులో బండి సంజయ్‌ను అరెస్టు చేశారో డీజీపీకి కూడా తెలియకపోవడం తెలంగాణలో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న తీరుకు నిదర్శనమని కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి ని ఏ జైలుకు తీసుకొనివెళ్ళారో తెలియకపోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్ట్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బండి ని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు భావిస్తున్నారు, బీజేపీ జాతీయ అడ్జక్షుడు నడ్డా తాజా పరిస్థితులను కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తెచ్చినట్లు తెలుస్తుంది,
