సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ వివాదాస్వాద సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నేత, బండ్ల గణేష్‌కు ఏపీలోని ఒంగోలు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనకు ఏడాది జైలుతో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టుకి ఆయన నేడు బుధవారం హాజరయ్యారు. ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్ష, 95 లక్షలు జరిమానాను సెకండ్ ఏఎంఎం కోర్టు విధించింది. అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్‌కు కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. 2019లో ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు వద్ద ఆయన రూ.95 లక్షలు తీసుకున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో బండ్ల గణేష్ చెక్ ఇచ్చారు. చెక్ బౌన్స్ కావడంతో విచారించి కోర్టు బండ్ల గణేష్‌కు జైలు శిక్ష, జరిమానా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *