సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క వేసవి ప్రారంభ రోజులు మరో ప్రక్క కళ్యాణ శుభముహూర్తాలు వస్తున్నా పూలు ధరలు పడిపోతుండటంతో గత మూడు నెలుగా ధరలు పెరగకపోవడంతో ఏపీలోని కడియం, మరియు కుప్పం ప్రాంతాలలో విశేషముగా ఉన్న పూలు పండించే ఉద్యానవన రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రాజమండ్రి సమీపంలోని కడియం తో పోలిస్తే చిత్తూరు సమీపంలోని కుప్పం ప్రాంతంలో పూలు రైతులు పరిస్థితి దారుణంగా ఉంది. వీరు బంతి, చేమంతి, కనకాంబరం, రోజా, లిల్లీ, మల్లె, సంపెంగ, కాగడా తదితర పూలను సాగుచేస్తున్నారు. కుప్పం మార్కెట్‌కు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచీ వ్యాపారులు వచ్చి పూలను కొనుగోలు చేస్తుంటారు. ఈసారి బంతి, చామంతి, రోజా పూల ధరలు బాగా తగ్గిపోయాయి.కిలో ధర రూ.10 పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనివారికి ఇచ్చే కోత ఖర్చు కూడా రావడంలేదని వాపోతున్నారు. ఈనెల 15వ తేది తర్వాత పెళ్లిళ్ల ముహుర్తాలు ఎక్కువగా ఉన్నప్పటికీ , ధరలు పెరుగక రైతులకు వైరాగ్యం ఎదురవుతోంది. అయితే రీటైల్ మార్కెట్ వ్యాపారులు . పంక్షన్ హాలులో డెకరేషన్ కాంట్రాక్టు దారులకు మాత్రం మంచి డిమాండ్ ఉంది. ఎలానూ వచ్చే 4 నెలలు మంచి ముహుర్తాలు ఉంటాయి. గోదావరి జిల్లాలో వచ్చే ఏడాది పుష్కరాల నేపథ్యంలో ఈ ముహుర్తాలలోనే పెళ్లిళ్లు పూర్తీ చేస్తారు కాబ్బటి ఇక్కడ పూలకు మాత్రం ఇకపై డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
