సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎప్పుడో బ్రిటీష్ కాలం నుండి కృష్ణ జిల్లా ప్రజలు చిరకాల స్వప్నం.. బందరు పోర్టు పనులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా బందరు పోర్టు నిర్మాణ పనులను సీఎం మొదలుపెట్టారు. ముందుగా తపసిపూడిలో సముద్రుడికి హారతి ఇచ్చి, గంగమ్మ తల్లికి పూజ చేసి పట్టువస్త్రాలు సమర్పించారు. గంగమ్మతల్లికి చీర, సారెతో పాటు పసుపు కుంకుమను భక్తి ప్రవర్తులతో సమర్పించారు.అన్ని అనుమతులు ముందుగానే రావడంతో శంకుస్థాపన తదుపరి వెనువెంటనే నిర్మాణ పనులు ప్రారంభించారు. బ్రేక్ వాటర్ పనుల్లో భాగంగా 99 లారీల్లో తీసుకొచ్చిన కొండ రాళ్ళతో డంపింగ్ చేశారు. దీంతో తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బందరు పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. శంకుస్థాపన జరిగినే రోజే బందరు పోర్టు పనులు మొదలయ్యాయి. ఈ పోర్ట్ నిర్మాణం పూర్తీ అయితే ఎగుమతులు దిగుమతులతో 20వేల మంది స్థానికులకు ఉపాధి లభించనుంది
