సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఇటీవల కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రజా వ్యతిరేక కార్పోరేట్ అనుకూల బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని దానిని నిరసిస్తూ ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వామపక్ష పార్టీల అధ్వర్యంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనా కార్యక్రమాల్లో భాగంగా నేడు, శనివారం భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో వామపక్ష పార్టీల అధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరామ్ మాట్లాడుతూ.. కేంద్రం ప్రదర్శించిన బడ్జెట్ ధరలను పెంచేదిగా, నిరుద్యోగ రైతాంగం ఆత్మహత్యలను పెంచేదిగా ఉందని, సామాన్యులను, కౌలు రైతు, కార్మిక, రైతు కూలీలను మోసం చేసే బడ్జెట్ అని రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకుని బడ్జెట్ ను పార్లమెంటుకు తిప్పి పంపాలని డిమాండ్ చేశారు. ఎరువులు, పురుగు మందులు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడానికి బడ్జెట్లో చూపలేదని, చేతి వృత్తి దారులను దగా చేశారని , ఉపాధికి నిధులు కేటాయించలేదని కోనాల విమర్శించారు. నల్ల సాగు చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ వీధుల్లో అసువులు బాసిన 750 మంది రైతుల ఆత్మబలిదానాన్ని మోడీ అపహాస్యం చేస్తున్నాడని కోనాల విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణకు చర్యల్లేవని, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ను బడ్జెట్లో ప్రస్తావించలేదని కోనాల ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి మాట్లాడుతూ బడ్జెట్లో మన రాష్ట్రానికి కేటాయింపులు లేకపోయిన టిడిపి, జనసేన నోరెత్తకపోవడం దారుణమని,అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి.గోపాలన్ మాట్లాడుతూ. 149 కోట్ల మంది ప్రజానీకాన్ని పక్కనపెట్టి దొడ్డి దారిన కార్పోరేట్ శక్తులకు నిధులు కేటాయిస్తున్న దగా బడ్జెట్ అని ప్రజలపై పన్నుల భారం, కార్పోరేట్లకు పన్నుల్లో రాయితీ ఇదెక్కడి న్యాయం అని గోపాలన్ ప్రశ్నించారు.
