సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం వారి కోడలు ..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత మంగళవారం పార్లమెంట్‌కి సమర్పించిన బడ్జెట్లో.. ఏనాటి నుంచో 2 అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి వెళుతున్న ఉభయ గోదావరి జిల్లాలను మరింత దగ్గర చేసే కోటిపల్లి నుండి నరసాపురం కు మరిన్నినిధుల కేటాయింపు ఫై ప్రకటన రాకపోవడం గోదావరి జిల్లాల ప్రజలను సంశయంలోకి నెట్టింది. అయితే ఏపీలో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలెప్మెంట్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో ఇంకా కాస్త ఆశలు మిగిలి ఉన్నాయి. అయితే గోదావరి జిల్లాల ప్రజల రైల్వే లైన్ లకు సంబంధించి అన్ని సమస్యలు కేంద్ర రైల్వే మంత్రికి విన్నవించామని వారు ఆమోదించారని రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి తాజా వ్యాఖ్యలు చేసారు. అయితే నిజానికి కొన్ని నెలల కిందట ప్రవేశపెట్టిన రైల్వే మధ్యంతర బడ్జెట్లో కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైనుకు రూ.300 కోట్లను కేంద్రం కేటాయించింది.అయితే ఈసారి బడ్జెట్లో ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై స్పష్టత లేదు. నిధులు అందక గౌతమి, వశిష్ట, వైనతేయ నదులపై నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెనల పనులు ఎక్కడిక్కడే అసంపూర్తిగా నిలిచిపోయాయి. కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో కాకినాడ-పిఠాపురం రైల్వేలైను నిర్మాణానికి కేటాయిం పులపై ఇంకా స్పష్టత రాలేదు నిడదవోలు-కాల్దరి మధ్యలో 9.75 కి.మీ మేర రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి గెజిట్ నోటిఫికేషన్ విడు దలైంది. కానీ అంచనా వ్యయం.. పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అనే దానిపై స్వస్థత రాలేదు.
