సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు కు చెందిన ఆత్కూరి సాయిమణిదీప్‌ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్‌ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతు న్నాడు. హాస్టల్‌ గదిలో మణిదీప్‌తో ఉంటున్న తోటి విద్యార్థులు పండుగకు స్వగ్రామాల కు వెళ్లారు. ఇంకా రాలేదు. శనివారం రాత్రి 7 గంటల వరకు పక్క రూమ్‌ విద్యార్థులతో మా ట్లాడి తలుపులు వేసుకున్న మణిదీప్‌ నిన్న ఆదివారం ఉదయం 10 గంటల వరకు బయటకురాలేదు. పక్క రూమ్‌ విద్యార్థులకు సందేహం కలిగి కిటికీలో నుంచి చూడగా బాత్‌రూమ్‌లో అచేతనంగా పడి ఉన్నట్లు గుర్తించారు. సాయిమణిదీప్‌ (24) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ సూసైడ్‌ నోట్‌ రాసి అందులో డాడీ, అమ్మా, తమ్ముడూ నన్ను క్షమించండి, గత పదేళ్లుగా మిమ్మల్ని చాలా చాలా కష్టపెట్టాను.గత 8-9 నెలల నుంచి సూసైడ్‌ ఆలోచనలు తినేస్తున్నాయి. బతకాలి అంటే భయమేస్తోందమ్మా. నా గురించి కాదు, ఇంకా ఎంత కాలం మిమ్మల్ని బాధ పెడతా అని తన దీన పరిస్థితి వెల్లడించాడు.మణిదీప్‌కు బ్యాక్‌లాగ్‌ సబ్జెక్ట్స్‌ ఉండి పోయాయి. ఆ పరీక్షలు రాసేందుకు పండుగకు ఇంటికి వెళ్లలేదు. హాస్టల్‌లోనే ఉండిపోయాడు. మానసిక సంఘర్షణ కలిసి ఆత్మహత్యకు పురిగొల్పి ఉండవచ్చు.తండ్రి రామారావు నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో వికాస్‌ విద్యాసంస్థలో డైరె క్టర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా మణిదీప్‌ పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు గౌరీనంద్‌ బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *