సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య బనకచర్ల ప్రాజెక్టు తీవ్ర వివాదంగా మారింది.. ఎలాగైనా ఏపీ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్లను అడ్డుకుంటామంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రానికి పిర్యాదులు చేసారు. .. మిగులు జలాలనేకదా? మేం వాడుకునేది.. అభ్యంతరాలు ఎందుకంటూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నించింది.. అయితే ఎవరు ఊహించని విధంగా కూటమి ప్రభుత్వంలో భాగం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్‌ షాక్‌ ఇచ్చింది.. ఏపీ ప్రభుత్వం పెట్టుకొన్న బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపింది అలాగే ప్రాజెక్టు కు కావలసిన పర్యా వరణ అనుమతులు తిరస్కరించింది.. పర్యా వరణ అనుమతులు ఇవ్వాలంటే సీడబ్ల్యూ సీ పరిశీలించాల్సిఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.. గోదావరి నది జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ అవార్డ్ లు దీని పరిశీలించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తెలిపింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *