సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉద్దానం ప్రాంత ప్రజలను పీడిస్తున్న కిడ్నీ సమస్య పరిష్కారానికి వైఎస్సార్ సుజల ధార పంప్ హౌస్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను నేడు, గురువారం పలాసలో ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇక్కడ ఆసుపత్రిలో 375 మంది వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉం చామని.. ఉద్దానం అంటే ఉద్యా నవనం అని అన్నారు. తదుపరి చంద్రబాబు, పవన్‌పై విమర్శలు కురిపించారు. చంద్రబాబు హయాంలో కూడా ఉత్తరాంద్ర లో ప్రజలకు కిడ్నీ సమస్య ఉందని అప్పుడు ఎందుకు పరిష్కరించలేదన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యే గా సుదీర్ఘ కాలంగా ఉన్న కుప్పం కు నీరు ఇవ్వ లేని వ్య క్తి ఉత్తరాంధ్రపై ప్రేమ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. హైదరాబాద్ లో నివాసం ఉండే నాన్ లోకల్ చంద్రబాబుకు ఎన్నికలు వచ్చే సరికి ఏపీలో ఎత్తులు, పొత్తులు, కుయుక్తులు, దత్తపుత్రుడు మీద ఆధారపడతారన్నారు. ఈయన నాన్ లోకల్ దత్తపుత్రుడు తెలంగాణ ఎన్నికలలో .. తెలంగాణాలో ఎందుకు పుట్టలేదా అని బాధపడుతున్నాను.. ఆంధ్రా పాలకులకు చుక్క లు చూపిస్తా అని డైలాగ్‌లు కొట్టిన ప్యాకేజీ స్టార్‌కు తెలం గాణలో ఇం డిపెం డెం ట్‌గా నిలబడ్డ చెల్లమ్మా బర్రెలక్క కు వచ్చి నన్ని ఓట్లు కూడా దత్తపుత్రుడి పార్టీకి రాలేదని, అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయిన ఈయన మన ప్రజా ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తాడట.. అంటూ ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *