సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం బర్రెవానిపేట గ్రామంలో నేటి, శనివారం సాయంత్రం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును, అదేవిధంగా గత మూడు సంవత్సరాలుగా ప్రతి కుటుంబానికి అందిన ఆర్థిక సహకారాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ మరోపక్క ఇవ్వని హామీలను కూడా కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు రాజకీయం భయం పట్టుకుందని అన్నారు. ఇక్కడ లోసరి గ్రామంలో గత మూడు సంవత్సరాలుగా రూ 11 కోట్ల 63 లక్షల 27 వేల నిధులను ప్రజలకు సంక్షేమంగా అందించారని అన్నారు. గ్రామంలో జనాభా 3 వేల 350 మంది ఉన్నారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మోసానికి రాష్ట్ర ప్రజలు 23 సీట్లతో బుద్ధి చెప్పారని, అయినప్పటికీ కూడా ఆయన వైఖరిలో గాని దత్తపుత్రుడు వైఖరి లోకాని ఏమాత్రం మార్పు రాలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థికవేత్త అని, కరోనా సమయంలో కూడా ప్రణాళిక బద్ధంగా వ్యవహరించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో .ఎంపీపీ పేరిచర్ల విజయనసింహరాజు, జడ్పిటిసి కాండ్రేగుల నరసింహారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరు మా ని ఏడుకొండలు, వైస్ ఎంపీపీ తిరు మా ని గంగాభవాని ధనుంజయ, రామాని కాస్టర్ వర్మ, బర్రె పెద్దిరాజు, తాసిల్దార్ వై రవికుమార్, పంచాయతీరాజ్ డిఇ స్వామి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
