సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెమ్మదిగా బంగాళాఖాతంలో కదులుతున్న దిత్వా తుపాను చెన్నయ్ మరియు నెల్లూరు మధ్య తీరప్రాంతంలో కేంద్రీకృతం అయ్యింది. చాల నెమ్మదిగా కదులుతూనే ఉంది కానీ ఎక్కడ తీరం దాటే సూచనలు లేవు ప్రస్తుతం తుపాను నుండి వాయిగుండం స్థాయికి ప్రభావం తగ్గింది. అయితే గోదావరి జిల్లాలలో నేడు, మంగళవారం కూడా వర్షపు ముసురు, తీవ్ర చలిగాలుల ప్రభావం ఎక్కువగానే ఉంది. భీమవరములో ఉదయం నుండి తెరిపి లేకుండా ఓ మోస్తరు వర్షం పడుతూనే ఉన్నది. ఉమ్మడి పశ్చిమ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రక్క వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నా ఈ సమయంలో భారీగా వర్షాలు కురిస్తే వరి పంట దెబ్బతింటుందన్న ఆందోళన రైతులు ఆందోళన చెందుతున్నారు. కోసిన వరి పంటను రక్షించుకోవడానికి కల్లాల్లో రోడ్లపై కుప్పలు వేసి లారీ బరకాలు తో మూసివేస్తునారు. ఏది ఏమైనా భారీ వర్షాలు పడితే మాత్రం భారీ నష్టం పొంచివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *