సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాత్రి మొంథా తుఫాన్ పశ్చిమ గోదావరి నరసాపురం మీదుగా 90 కిమీ వేగంతో తీరందాటింది., అయితే 1996 నాటి తుపాను తరహాలో 200 కిమీ వేగంతో గాలుల విద్వంసం ఈసారి లేకపోవడంతో అందరు ఊపిరి తీసుకొన్నారు. అయితే భారీ వర్షాలు పెనుగాలుల ఉదృతి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అంతర్వేది ఉప్పాడ వద్ద సముద్రం క్షణమొక రకంగా సముద్రం విరుచుకుపడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాలు బాగా ఎఫిక్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్ర లో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. అయితే నేటి బుధవారం తాజా సమాచారం ప్రకారం మొంథా తుఫాన్ క్రమంగా బలహీనపడుతున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ(బుధవారం) రేపు గురువారం కూడా రాష్ట్రంలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అన్ని విద్య సంస్థలు మూసివేశారు.
