సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పూర్ లో గత మంగళవారం రాత్రి సుమారు 7గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గత రాత్రి నుండే ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ సమయంలో భారీ వర్షం పడుతోంది. దాంతో కొండచరియలు విరిగి బస్సు మీద పడ్డాయి. గత అర్ధరాత్రికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.బస్సు నుంచి నేటి బుధవారం ఉదయం కి అన్ని మృతదేహాలను అధికారులు వెలికితీశారు.
