సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: రేపటి నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు, సోమవారం కృష్ణ జిల్లా లో కేశవరావు పల్లిలో గాయంతోనే ప్రచారానికి వచ్చిన సీఎం జగన్ ను శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు పరామర్శించడం జరిగింది. కంటి పైన 3 కుట్లు పడినప్పటికీ వాపు ఆలా ఉండగానే ,విశ్రాంతి తీసుకోకుండా ఇలా ఎండలలో మరల ప్రజలు మధ్యకు వచ్చెయ్యడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేసారు. ఆయనతో పాటు మంత్రులు జోగి రమేష్ , కారుమూరి నాగేశ్వర రావు తదితర ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎం జగన్ వారిని నవ్వుతు పలకరిస్తూ రేపటి నుండి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన లో చేస్తున్న ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకొన్నారు
