సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఎదో ప్రమాదల సీజన్ లా అప్రతిహతంగా బస్సు ప్రమాదాలు ప్రతి రోజు జరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా శిరివెళ్లమెట్ట దగ్గర కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారిపై నేడు, గురువారం తెల్లవారు జాము ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్(ARBCVR) బస్సు, కంటైనర్ లారీ ఢీకొని ముగ్గురు మృతిచెందారు. బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో డివైడర్‌ను దాటి వెళ్లిపోయి.. ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి లారీకి సైతం అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్ భాస్కర్, కంటైనర్ లారీలోని డ్రైవర్, క్లీనర్‌లు క్యాబిన్‌లో చిక్కుకుపోయి సజీవ దహనం అయ్యారు..బస్సులోని ద్విచక్రవాహనాలు కూడా మంటల్లో కాలిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బస్సు క్లినర్ సాహసోపేతంగా వ్యవహరించడంతో ప్రయాణికులు అప్రమత్తమై తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *