సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాపట్ల జిల్లాలో నేడు, ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వినుకొండ నుండి నరసరావుపేట వెళ్తుండగా ఆటోని లారీ బలంగా ఢీకొట్టింది. సంతమగులూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏకంగా ఐదుగురు మృత్యువాతపడ్డారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఉన్నారు. ఇక చికిత్స పొందుతూ మరో ఇద్దరు కన్నుమూశారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. కాగా మృతులు నరసరావుపేటకి చెందిన డాన్స్ పార్టీ గ్రూప్‌గా గుర్తించారు.
