సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు ను జలఖడ్గం తో విద్వంసం చేసిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్ ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల సమీపంలో నేటి ఉదయం 11-50కి తీరాన్ని తాకింది. మరో గంట లోపు తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరిలో తీవ్ర స్థాయిలో , విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమలో కొంత తెరిపి ఇవ్వడం విశేషం..తుపాను తీరం తాకిన సమయంలో.. గంగాళాలతో ఆకాశం నుండి నీరు పోసిన తీరుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నరసాపురం లో కుంభవృష్టి 2గంటల పాటు కురిసింది. గత 3 రోజులుగా వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రస్తుతం, చెన్నై, నెల్లూరు జిల్లాలో గాలుల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ వర్షాలు కొనసాగనున్నాయి. తుఫాను ఉత్తర దిశగా నెమ్మదిగా ముందుకు కదులుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్లు గాలులు వీస్తున్నాయి… ప్రభుత్వ అధికారులు అప్రమత్తం అయ్యారు. ముంపు ప్రాంతాల్లో సముద్రం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇటు రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు ఓ మోస్తారుగా కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగనున్నాయి.
