సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం సాయంత్రం వైసీపీ కీలక నేతలు పేర్నిని నాని, కొడాలి నాని, వంశీ లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్నినాని మాట్లాడుతూ.. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు ప్రవిత్రకు భంగం వాటిల్లేలా మాట్లాడి ఇరుకున పడ్డారని, వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ నెలలో లడ్డు లో కల్తీ జరిగిందని రిపోర్ట్ చూపి తమ అసమర్ధత ను కప్పి పుచ్చుకొంటూ .. అది గత వైసీపీ సర్కార్ పైకి తోసెయ్యడం ఏమిటని? అసలు జగన్ హయాంలో లడ్డు నాణ్యత లో లోపాలు ఫై ఏ ఆధారాలు లేవని కావాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ని తన స్వార్ధ రాజకీయం కోసం రాజకీయాలలోకి లాగిన పాపం చంద్రబాబు దే అన్నారు. ఏమిటి? పవన్ కళ్యాణ్ దుర్గ గుడి శుభ్రం చెయ్యడం? తిరుమల లడ్డు కోసం పవన్’ ప్రాయిశ్చిత్ దీక్ష చెయ్యడం ఏమిటి? ‘‘పవన్ కళ్యాణ్ హిందువు అని చెబుతున్నారా? ‘భీమవరంలో’ తాము ప్రేమ స్వరూపుడైన ఏసు మార్గంలో ఉన్నామని, మేము క్రెస్తవులు సేవ స్వరూపులం .. బెత్లహేము వెళ్లి బాప్టిజం కూడా తీసుకున్న అని పవన్ స్వయంగా చెప్పారు..( ఈ వీడియో వైరల్ అవుతుంది) ఆ పవన్ కళ్యాణ్‌ ఏనా? ఈ పవన్ కళ్యాణ్. రష్యాలో చర్చిలో భార్య పిల్లలతో మొకాళ్ళపై కూర్చున్నది ప్రజలు మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ పిల్లలకు క్రిస్టియన్ పేర్లు కూడా పెట్టుకున్నారు కదా . మేము మాత్రం అంతా మొదటి నుంచి హిందువులం. పవన్ కళ్యాణ్ కొత్తగా మళ్లీ హిందూ మతం తీసుకున్నారా’? మరి సనాతన హిందూ ధర్మం, లడ్డు పవిత్రం ఫై హిందువులు కు చైతన్యం రాదా? అంటూ ప్రజలను ఎవరి కోసం రెచ్చగొడుతున్నాడు? ’ అని పేర్ని నాని ప్రశ్నలు సంధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *