సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో 50 స్థానాలకు 39 స్థానాలలో విజయం సాధించిన వైసీపీ నేతలతో జరిగిన అభినందన సమావేశంలో వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇంత కష్టసమయంలో కూడా అధికార పార్టీ ప్రలోభాలకు, దాడులకు కేసులకు లోగకుండా పార్టీమీద అభిమానము తో బలం లేకపోయినా మోసపూరితంగా గెలవాలనుకొనే సీఎం చంద్రబాబు ఎన్నికల జోలికి వస్తే భయం పుట్టేలా మీ గెలుపులతో బుద్ధి చెప్పారని, మీ తెగువకు, నిజాయితీకి నా సెల్యూట్ అన్నారు. కరోనా 2 ఏళ్ళు ఇతర సమస్యలతో ప్రజలు ఫై ద్రుష్టి పెట్టి కార్యకర్తలను నేను పట్టించుకోలేదని, వారికీ మేలు చెయ్యలేదని మాట వినిపిస్తోందని, అయిన మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి ఒక మాట ఇస్తున్నానని, ఇకపై పార్టీ కార్యకర్త కె ప్రధమ ప్రాధాన్యత ఇస్తానని,అప్పుడే కూటమి పాలన కు ఏడాది గడుస్తుంది. మరో 3 ఏళ్లలో ( జమిలి ఎన్నికలు..) వైసీపీ భారీ మెజారిటీ తో అధికారంలోకి రావడం ఖాయం అని ఇకపై రాబోయే రోజులు లో జగన్‌ 1.0కు భిన్నంగా 2.0 ఉంటుందన్నారు. కార్యకర్తల కోసం ఈసారి గట్టిగా నిలబడతానన్నారు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు తాము మోసపోయామని ఇప్పటికే గ్రహించారని, కూటమి ప్రభుత్వం తలపెట్టిన P4 విధానంపైనా విమర్శలు చేశారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ ఎగ్గొట్టేందుకే అప్పులపై అబద్ధాలు చెప్తున్నారంటూ జగన్ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *