సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేష్‌కు రాష్ట్ర కాపు నాడు ఉద్యమ నేత. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి (ముద్రగడ పద్మనాభం ) ఘాటు లేఖ రాశారు. మాజీ మంత్రులు అంబటి , జోగి రమేష్ ల ఇండ్లపై దాడులు, నేతలపై దాడులు, అరెస్ట్ లు నేపథ్యంలో తీవ్ర అభ్యన్తరం వ్యక్తం చేసారు చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. ప్రతిపక్ష వైసీపీ నేతలు అయినప్పటికీ కాపు నేతలను తీవ్ర అవమానకరంగా దాడులు చెయ్యడం వారిపైనే కేసులు పెట్టి అరెస్టులు చెయ్యడం కాపు సమాజంపై జరుగుతున్న చర్యలు తీవ్ర అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. కాపు కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ ముద్రగడ తీవ్రవ్యాఖ్యలు చేశారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని అవమానాలకు గురిచేశారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
