సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీ లో శీతాకాలంలో కూడా వరుణదేవుడు పగబట్టినట్లు ఇష్టం వచ్చినట్లు వరుసగా అల్పపీడనాలు, వాయుగుండాలు,తుపాను లు వరుసగా దంచి కొడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఏపీని ఓ వైపు ఫెంగల్ తుపాను తీరం దాటిన దాని ప్రభావం ఇంకా వీడకుండా వర్షాలు పడుతూనే ఉంటె ..తాజగా మరో షాక్ ఇచ్చారు. వాతావరణ శాఖ అధికారులు. ఏపీకి ఫెంగల్ ముప్పు తక్కువే అయినా.. మరో ముప్పు పొంచి ఉందని ప్రకటించారు. ఈ డిసెంబర్ రెండో వారంలో నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి తుపానుగా పరిణమించే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావం ఈసారి, ఏపీపై అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొనడం మరింత ఆందోళనకు గురి చేస్తుంది. దీని ప్రభావం ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర గోదావరి జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. తీర ప్రాంత జిల్లాలో భారీ వర్షాలు పడతాయని భావిస్తున్నారు.
