సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక సినిమా చేస్తున్న(NBK 111) విషయం తెలిసిందే. వ్రిద్ది సినిమాస్ తెరకెక్కస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. శాతకర్ణి తరహాలో రాజరికం ఛాయలతో పీరియాడికల్ బ్యాక్డ్రాప్ లో గ్రాండ్ గా నిర్మించనున్న ఈ సినిమా నుంచి మహారాణిగా గా నయనతార అంటూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్ నేడు, మంగళవారం నవంబర్ 18 నయనతార పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా నుంచి ఆమె లుక్ ను విడుదల చేశారు. ఇక రాజమౌళి మహేష్ బాబు ల కాంబినేషన్లో పాన్ వరల్డ్ సినిమా ‘వారణాసి లో హనుమంతునిగా కన్నడ కిచ్చి.. ఈగ విలన్ ‘సుదీప్’ నటిస్తున్నాడని సమాచారం వచ్చింది. వరుస సినిమాలులో నటించడానికి సీనియర్ హీరో రాజశేఖర్ ముందుకు వస్తున్నారు. శర్వానంద్ హీరోగా బైకర్ లో కీలక పాత్ర పోషిస్తున్న రాజా శేఖర్ ఇటీవల తమిళ్ లో హిట్ సాధించిన ఒక సినిమా రీమేక్ లో హీరోగా ఆయనకు జంటగా రమ్య కృష్ణ తో జోడి కట్టనున్నారు.
