సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ మోస్ట్ ఎవైటెడ్ షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 3’ వచ్చేస్తోంది. బుల్లితెరపై తనదైన తరహాతో రెండు సీజన్లను కంప్లీట్ చేసి.. తెలుగు ఓటిటి చరిత్రలో తొలిసారి అద్భుతమైన ఆదరణను చూరగొన్న బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షో.. ఆహా ఓటీటీ లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి సెలబ్రిటీలతో బాలయ్య ఆడిన గేమ్స్, వారి నుంచి రాబట్టిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం.. ఇప్పటికీ ఈ షో గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. అందుకే ఆహా యాజమాన్యం సీజన్ 3కి శ్రీకారం చుట్టారు. అన్ స్టాపబుల్ సీజన్ 3కి హోస్ట్‌గా చేసేందుకు అక్టోబర్ 5న బాలయ్య సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దసరాకి హీరో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ విడుదల కాబోతోన్న నేపథ్యంలో.. ఈ చిత్రయూనిట్‌తో సీజన్ 3కి సంబంధించి ఓ ఎపిసోడ్ దసరా రోజులలో ఉండే అవకాశం ఉందనేలా టాక్ నడుస్తోంది. అంతేకాదు.. ఈసారి బాలయ్య మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తెలంగాణ మంత్రి కేటిఆర్ వంటి పాపులర్ వ్యక్తులను ఇంటర్యూ చేయబోతున్నారనే ప్రచారం జోరుగా నడుస్తున్న నేపథ్యంలో.. ఈ సీజన్ 3 మరింత ఆసక్తికరంగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *