సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ పరిశ్రమ లో అగ్రహీరోగా రాణిస్తున్న నందమూరి బాలకృష్ణ వచ్చే ఆగస్టు 30కి నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని తెలుగు సినీ పరిశ్రమ ఆయనను ఘనంగా సన్మానించాలని నిర్ణయం తీసుకుంది. నందమూరి బాలకృష్ణ తొలిసారి నటించిన ‘తాతమ్మ కల’ సినిమా 1974 ఆగస్టు 30న విడుదలైంది. అంటే రానున్న ఆగస్టు 30కి బాలకృష్ణ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న సాయంత్రం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సినిమా రంగానికి చేసిన, చేస్తున్న సేవలను ప్రస్తావిస్తూ ఓ ఆహ్వాన పత్రికను రూపొందించి విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ సినిమాల పరంగా సాధించిన రికార్డులను, రాజకీయాల్లో, సామాజిక కార్యమాల్లో ఆయన చేస్తున్న సేవలను పొందుపరిచారు. ఇప్పుడు ఈ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
