సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక శాటిలైట్ ఛానెల్ డెబిట్ లో ఏపీ ప్రభుత్వ తెలుగు బాషా సంఘం చైర్మెన్, స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి సంచలన విషయాలు, బాలకృష్ణ ఫై తీవ్ర ఆరోపణలు చేసారు. ఇటీవల యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరును తొలగించి సీఎం జగన్ తన తండ్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం ఫై తనకు మొదట ఇబ్బందిగా అనిపించిన, ఏకంగా ఒక జిల్లా కే ఎన్టీఆర్ పేరు పెట్టిన సీఎం జగన్ మనస్సు విశాలం అని , ఎదో బలమైన కారణం వల్ల ఆలా చేసారని,మరో సంస్థ కు ఎన్టీఆర్ పేరు పెడతారని సమర్ధించారు. ఇప్పటివరకు ఎవరికీ తెలియనిది ఏమిటంటే.. ఎన్టీఆర్ తనయులు, కూతుళ్లు ఆయన ఆస్తి పంచుకొన్నప్పటికీ, అల్లుళ్లు కొడుకులు పార్టీ ని లాగేసుకొన్నప్పటికీ కృతజ్ఞత తో ఆయన పేరు చిరస్థాయిగా నిలబడేలా “భారత రత్న” కాదుకదా !ఎక్కడ తండ్రి పేరు నిలబెట్టే పని చెయ్యలేదు అని విమర్శించారు. తెలుగు దేశం పార్టీ అధ్యక్ష పదవి నుండి ఎన్టీఆర్ ను అధికారికంగా గెంటేసిన చంద్రబాబు కు పార్టీ వ్యవస్థాపక అడ్జక్షుడు ఎన్టీఆర్ గౌరవం ఫై, సీఎం జగన్ ఫై మాట్లాడే అర్షత ఉందా ? బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ క్షోభ తో మరణించడంలో కీలక పాత్ర దారి అని.. అతనికి తనను, జూనియర్ ఎన్టీఆర్ ను హీనమైన బాషా తో తిట్టే అధికారం ఎక్కడ నుండి వచ్చింది? చంద్రబాబు వంటి వ్యక్తి దగ్గర శునకం లా ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్నది బాలకృష్ణ నే అని విమర్శించారు. బాలకృష్ణ నిర్మాతలఫై రివాల్వర్ హత్య యత్నం చేసి వారిని గాయపరచినప్పుడు, ఒరిస్సా కు చెందిన యువకుడు మరణించినపుడు సీఎంగా ఉన్న వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పెద్ద మనస్సుతో బాలకృష్ణ ను కేసుల నుండి కాపాడారని ఆ కృతజ్ఞత కూడా బాలయ్యకు లేదని విమర్శించారు. ఎన్టీఆర్ కుమారులు తనను ఇంటి నుండి గెంటివేసినప్పుడు, చేతిలో డబ్బు లేన్నపుడు తనకు అపట్లోనే ఏ రక్త బంధం లేకపోయినా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న యువకుడు జగన్ మోహన్ రెడ్డి అని, చంద్ర బాబు లా ఇరుకైన మనస్సు కాదని జగన్ ది చాల పెద్ద మనస్సు అని కొనియాడారు. పార్టీ అవసరానికి వాడుకోగానే జూనియర్ ఎన్టీఆర్ ను ఎంత దూరంగా పెట్టారో అందరికి తెలుసనీ.. జూనియర్ ఎన్టీఆర్ వివాహం అప్పుడు కూడా పిల్లను ఇవ్వకుండా చంద్రబాబు తన దగ్గర బంధువు, నార్నె శ్రీనివాసరావు ( ప్రస్తుత వైసిపి ఎంపీ)ను మందలించాడని ఆరోపించారు. ఇప్పడు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా వచ్చి కలిసే విందు చేసే స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ ఎదిగిపోయాడని ప్రశంసించారు.చంద్రబాబు కొడుకు లోకేష్ కు చదువు సంధ్య అబ్బలేదని, ఒక్క బాషా కూడా మాట్లాడలేని వ్యక్తి ని రాష్ట్ర ప్రజలకు సీఎం చేయాలనీ చంద్రబాబు కలలు కంటున్నాడని విమర్శించారు.
