సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తన 109 వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర లో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఇటీవల ఎన్నికల ప్రచారంలో బిజీ గా వుండి బాలయ్య ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.తాజాగా ఎన్నికలు ముగియడంతో బాలయ్య తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ గ్లింప్సె వీడియో రిలీజ్ చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.బాలయ్య మాస్ డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.జూన్ 10 బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ,టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు .ఇక సినిమాను అక్టోబర్ 10 న దసరా కానుకగా రిలీజ్ చేస్తారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *