సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ తో బోయపాటి శ్రీను లది క్రేజీ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో ఇప్పటికే 3 సినిమాలు సింహ, లెజెండ్, అఖండ విజయాలు సాదించాయి. వీరిద్దరి కలయికలో సినిమా అంటే ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం బాలయ్య అనిల్‌ రావిపూడితో శరవేగంగా దసరా కు విడుదల చేసే దిశగా సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యాక బోయపాటితో ఓ సినిమా చేస్తారని టాక్‌ వినిపిస్తోంది. ఈ కాంబో గురించి నేడు, సోమవారం ఓ వార్త వైరల్ అవుతుంది. ఏపీలో తెలుగు దేశం పార్టీకి 2024 ఎన్నికలకు ఉపయోగపడేలా బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారట. దీనిని” లెజెండ్ పార్ట్ 2″గా ‘హిస్టరీ రిపీట్’ టాగ్ తో సిద్ధం చెయ్యాలని యోచనలో ఉన్నారు. లెజెండ్ చివర క్లయిమ్యాక్స్ లో విలన్ జగపతి ని సీఎం కాకుండా బాలకృష్ణ అడ్డుకోవడంతో ముగుస్తుంది. అక్కడి నుండి సినిమా స్వీక్వల్ విజయదశమి కి షూటింగ్ ప్రారంభిస్తారని..పూర్తీ రాజకీయాలతో ముడిపడేలా కధ తయారు చేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. అయితే బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో ‘అఖండ’కు సీక్వెల్‌ తీయాలనుందట. అఖండ పార్ట్ 2 లో హిందూ ధర్మం తో పాటు కాస్తా పొలిటికల్ టచ్ ఇచ్చి సినిమా తీస్తే బాగుంటుందని ఆ దిశగా ఆలోచించమని బోయపాటి కి చెప్పారని తెలుస్తుంది.మొత్తానికి ఈసారి పొలిటికల్ సినిమా ఖాయం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *