సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా దిల్ రాజు నిర్మాతగా తొలిసారి నిర్మిస్తున్న సినిమా ఫైనల్ అయినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.మరి . ఆ చిత్రానికి దర్శకత్వం వహించే దర్శకుడు ఎవరూ అంటూ అందరికి వచ్చిన ఆత్రుత తొలగిస్తూ ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ పేరు వినిపిస్తోంది. డైరెక్టర్ గా కళ్యాణ్ రామ్ హీరోగా తొలి సినిమా ‘బింబిసార’ (Bimbisara) ఫాంటసీ సినిమా బంపర్ హిట్ తోనే తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు వశిష్ఠ (Vashista). అతనిలోని ప్రతిభను గమనించే చిరంజీవి (Chiranjeevi) సైతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమాలో నటించారు. ‘విశ్వంభర’ త్వరలోనే సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మరో టాప్ స్టార్ బాలయ్యతో వశిష్ఠ సినిమా ఫైనల్? కావడం గమనార్హం. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *