సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: తాజాగా అఖండ వంటి బంపర్ హిట్ కొట్టిన దమ్ముతగ్గని సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో విలన్‌గా అర్జున్ నటించబోతున్నారనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ‘క్రాక్’ సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చిన గోపీచంద్ మలినేని నెక్స్ట్ సినిమాను బాలయ్యతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదులో హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తోంది. ‘క్రాక్’ సినిమా మాదిరిగానే వాస్తవ సంఘటనలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాగా, ఇందులో పవర్‌ఫుల్ విలన్ పాత్రకు జెంటిల్ మెన్..సీనియర్ హీరో అర్జున్ ఎంపికైనట్టు సమాచారం. ఇది నిజంగా రేర్ కాంబినేషన్స్, తెలుగులో సూపర్ హిట్ అయిన పలు సినిమాలు తమిళ్ లో హీరోగా చేసిన అర్జున్ ఇప్పడు బాలయ్యకు ప్రతినాయకుడిగా చెయ్యడం నిజంగా వైరైటీనే.. ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతాయి. త్వరలో ఈ విషయాన్నినిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది.
