సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హనుమాన్ దర్శకుడు, భీమవరం బ్రాండ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఎంట్రీ ఇస్తారని అందరూ భావించారు. కొంత షూటింగ్ కూడా జరిగింది, అయితే , కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. బాలయ్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఆదిత్య 369 (Aditya 369) సినిమాకు సీక్వెల్‌గా ఆదిత్య 999 (Aditya 999) మ్యాక్స్ రాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంతోనే మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నారు. విశేషమేమిటంటే, ఈ సినిమాకు స్వయంగా బాలకృష్ణే కథను అందిస్తున్నారు. బాలకృష్ణ శ్రీ కృష్ణ దేవరాయల పాత్రలో మరోసారి కనిపించే అవకాశం ఉంది. .టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చే ఈ కథను నేటి తరం అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసే బాధ్యతను డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) కి అప్పగించారు . గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక ఘన విజయాన్ని బాలయ్యకు అందించిన క్రిష్‌పై నందమూరి కుటుంబానికి పూర్తి నమ్మకం ఉంది. ఆయనతో ఎన్టీఆర్ కధానాయకుడు, అధినాయకుడు సినిమాలు నిరాశపరచిపినప్పటికీ క్రిష్ ప్రతిభ ఫై నమ్మకంతో బాలయ్య సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన ఈ భారీ బడ్జెట్ సినిమాను మొదలు పెడుతున్నారు.
