సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆహాలో నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ అన్నది ఎంత సంచలనం రేపిందో అందరికి తెలిసిందే. క్రేజీ ప్రోగ్రామ్. అన్ స్టాపబుల్ సీజన్ వన్ మరియు 2 లతో యాంకర్ గా పోగ్రామ్ హోస్టుగా బాలయ్య పేరు మారుమోగిపోయింది. ఓటిటి యాప్ ల చరిత్రలో అత్యధిక జనాధారణతో ఆహా కు ల్యాండ్ మార్క్ ప్రోగ్రామ్ గా మారింది. అతి త్వరలో బాలయ్య తో వరుస సిరీస్ గా కాకపోయినా అదే తరహాలో ప్రముఖులతో కొన్ని స్పెషల్ ఇంటర్వూ లు ప్లాన్ చేసి, స్పెషల్ ఎపిసోడ్ లు ప్రసారం చేయాలని ఆహా నిర్వాహకులు సిద్దమౌతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈసారి మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్ గా తీసుకువచ్చి హోస్ట్ బాలయ్య తో ఇంటర్యూలు గమ్మత్తయిన అట పాటలతో చిన్న మల్టీస్టార్ సినిమా ను తలపించేలా ఎపిసోడ్ ను తయారు చెయ్యడానికి ఆహా తరపున అల్లు అరవింద్ వారిని సంప్రదించి విజయం సాధించారని సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళా.. ఇద్దరికీ రాజకీయ నేపద్యాలు ఉన్న దృష్ట్యా ఈ షో మరింత సంచలనం రేపుతోంది. బాలయ్య , చిరు డేట్ లు సెట్ అయితే ఈ ఎపిసోడ్ తయారు చేసి, దసరా కానుకగా ఆహాలో 2 పార్ట్ లుగా ప్రసారం చేయాలన్నది ఆహా ప్యూహం , మరి చిరు బాలయ్య అభిమానుల భారీ అంచనాలను అందుకునేలా ఈ షో బాగా రావాలని కోరుకొందాం..
