సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ లో బాలయ్య కీలక బాధ్యతలు చేపడతారని అందరు భావించారు. అయితే కారణం ఏదైనా బాలయ్య సినిమాలకు సంబంధించి కార్యక్రమాలు , ఓటిటి షోలాలలో బిజిగా మారిపోయారు. తెలంగాణ ఎన్నికలలో కూడా టీడీపీ దూరంగా ?ఉంటుందని తాజా పరిణామాలు బట్టి తెలుస్తుంది. ఇక అక్కడ ప్రచారం చేసే బాధ్యత కూడా లేకపోవడంతో నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ తరువాత సినిమా షూటింగ్ కు దర్శకుడు బాబీ కొల్లి కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. దర్శకుడు బాబీ కొల్లి ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్యతో సినిమా షూటింగ్ కూడా వెంటనే మొదలు పెడుతున్నట్టుగా తెలిసింది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 6వ తేదీ నుండి హైదరాబాదులో బిహెచ్ఈఎల్ దగ్గర ఒక భారీ సెట్ వేసి, అందులో ఈ పోరాట సన్నివేశాన్ని 7 రోజులు చిత్రీకరించనున్నట్టుగా సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అనుబంధం ఉన్న సితార ఎంటర్ టైనమెంట్స్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం మరో విశేషం.. ఈ సినిమాలో రాజకీయానికి సంబంధించి ఎటువంటి డైలాగులు కానీ, సన్నివేశాలు కానీ ఉండకపోవచ్చు అని తెలుస్తోంది.
