సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాలయ్య తండ్రి పట్ల ఎనలేని అభిమానం చూపించడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ.. ఎన్టీఆర్‌తో పాటు.. ఇంకా చెప్పాలంటే తెలుగు తెరపై ఎన్టీఆర్‌తో కలిసిమెలిసి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన నటసామ్రాట్ ఏఎన్నార్‌ను ‘అక్కినేని.. తొక్కినేని’ అని కించపరిచేలా మాట్లాడటాన్ని,అద్భుత నటుడు ఎస్వీ రంగారావు ను ఆ రంగారావు అంటూ సంబోధించడం.. అక్కినేని అభిమానులు,సినీప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. మహిళలు , చిన్నారులతో సహా అందరినీ గౌరవిస్తూ ‘మీరు’ అని సంబోధించే ఎన్టీఆర్ కడుపున పుట్టిన బాలకృష్ణ ఏఎన్నార్‌ను ఇంతలా తూలనాడటం ఏంటని మండిపడుతున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఏఎన్నార్ కుమారుడు నాగార్జున నుంచి నేరుగా స్పందన లేకపోయినప్పటికీ ఆయన పెద్ద నాగచైతన్య ట్విట్టర్‌లో పెట్టిన పోస్టుతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది. ‘‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం..’’ అని అక్కినేని నాగ చైతన్య ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ పరోక్షంగా బాలకృష్ణను ఉద్దేశించిందేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని వెనుక అక్కినేని నాగార్జున మద్దతు లేదని చెప్పలేము.. ఈ పోస్ట్ కు నాగార్జున రెండవ కుమారుడు లైక్ కొట్టి తమ కోపాన్ని బాలకృష్ణ కు తెలిపారు. అక్కినేని తనకు బాబాయ్ లాంటి వాడని చెప్పుకునే బాలకృష్ణ ఇలా కించపరిచి మాట్లాడినందుకు అక్కినేని కుటుంబానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వర రావు డిమాండ్ చేశారు. మొత్తంగా చూసుకుంటే.. అక్కినేనిని తూలనాడుతూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పట్ల పలువురు పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *