సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పుష్ప 2 తో సుమారు 2వేల కోట్ల కలెక్షన్స్ తో పాన్ వరల్డ్ విజయం సాధించిన మైత్రి మూవీస్ దేశంలోని అన్ని ప్రధాన బాషలలో వరుసగా సినిమాలు నిర్మించడమే కాదు భారీ ఘనవిజయాలు కూడా సాధిస్తున్న నేపథ్యంలో.. టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ తెరకెక్కించిన అచ్చతెలుగు మాస్ తరహా యాక్షన్ ఎంటర్ టైనర్ ‘జాట్‘ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ( ముందు రవితేజ హీరో అనుకున్నారు. రెమ్యూనేషన్ తగ్గకపోవడంతో హిందీ హీరో సన్నీ డియోల్ చేసారు) జాట్ ను 50 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే..ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు కేవలాం 11 కోట్ల వసూళ్లతో ప్రారంభమై వీకెండ్ వచ్చేసరికి జోష్ పెంచింది. తొలి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 70.4 కోట్ల వసూళ్లు చేసింది. ఈ విజయంతో మైత్రి మూవీస్ త్వరలో . ‘జాట్’ సీక్వెల్ జాట్ 2 కూడా ఉండబోతున్నట్లు ప్రకటించారు. ‘జాట్ ఆన్ టు ఎ న్యూ మిషన్!’ జాట్2 అంటూ ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. తొలి చిత్రం ‘జాట్’. ఈ చిత్రంలో రణదీప్ హుడా విలన్‌గా నటించారు. జగపతి బాబు రమ్య కృష్ణ, రెజీనా కాసాండ్రా, సయామి ఖేర్, వినీత్ కుమార్ సింగ్, తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *