సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: ఇటివల తెలుగులో దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన బాలీవుడ్ హీరో, సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali khan) నేడు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు కత్తితో దాడి ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబం నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన ఓకే దొంగ దొంగతనానికి ప్రయత్నించాడు. అది గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. కత్తితో దాడి చేసి పారిపోయాడని తెలుస్తోంది. ఈ ఘర్షణలో సైఫ్‌కి 6 చోట్ల గాయాలయ్యాయి. రెండు చోట్ల చాల లోతుగా గాయమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సైఫ్‌కు శస్త్ర చికిత్స జరుగుతోంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కరీనా కపూర్ తో సహా . మిగిలిన కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు ‘‘సైఫ్ అలీఖాన్‌పై దాడి నన్ను ఎంతగానో కలచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’’ అని చిరంజీవి పోస్ట్ పెట్టారు. ఇదే ఘటనపై ఎన్టీఆర్ కూడా స్పందించారు. ‘‘సైఫ్ సర్‌పై దాడి గురించి తెలిసి షాకయ్యా. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలి’’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
