సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ లోని శ్రీ సరస్వతి దేవి పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న బాసర వద్ద గోదావరి నదిలో మునిగి నేడు, ఆదివారం ఐదుగురు యువకులు మృతిచెందారు.శ్రీ అమ్మవారి దర్శనానికి హైదరాబాద్‌లోని చింతల్ ఏరియా నుంచి మొత్తం 18మంది భక్తులు వచ్చారు. ఈ నేపథ్యంలో యువకులు స్నానం చేయడానికి స్థానికంగా ఉన్న గోదావరిలోకి దిగారు. వీరిలో ఐదుగురు యువకులు గోదావరిలో మునిగి మృతిచెందారు. పోలీసులు గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు చేపట్టారు. మృతులు రాకేష్, వినోద్, మదన్, రితిక్‌గా గుర్తించగా.. మరో యువకుడు భరత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో యువకులు మునిగిపోయినట్లు తెలుస్తోంది. తీవ్ర విషాదం నెలకొంది.
