సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు , శనివారం రీరిలీజ్ లో బాహుబలి ఎపిక్ సుమారు 4గంటల సినిమాగా టికెట్స్ రేట్లు పెంచకుండా ప్రపంచ వ్యాప్తంగా వేలాది థియేటర్స్ లో సంచలన రిలీజ్ కు సిద్ధం అవుతున్న విషయం అందరికి తెలిసిందే. అల్ ఇండియా సూపర్ స్టార్ .. ‘ప్రభాస్ మేడ్ ఇన్ భీమవరం’ కాబట్టి ఇక్కడ నేటి గురువారం సాయంత్రం 7గంటలకు స్థానిక మల్టి ఫ్లెక్స్ లో, విజయలక్ష్మిలో ప్రీమియర్ షోలు ఇప్పటికే హౌస్ ఫుల్.. రేపు ఒక్క రోజుల్లో రి రిలీజ్ లో రికార్డు స్థాయిలో 19 షో లు వేస్తున్నారు. టికెట్స్ డిమాండ్స్ దృష్ట్యా ఇంకా పెంచే యోచన కూడా ఉంది. ఇదిలా ఉండగా బాహుబలి 3 గురించి రాజమౌళి తాజగా ప్రభాస్, రాణాలతో పిచ్చాపాటీలో వివరణ ఇస్తూ అది బాహుబలి 3 కాదు. బాహుబలి ఎటర్నల్ వార్ అని ప్లాన్ చేశాను. బాహుబలి ఎపిక్ సినిమా చివర్లో ఆ టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నాను. బాహుబలి ఎటర్నల్ వార్ బాహుబలి సినిమాకు కధ కంటిన్యుటీనే ఉంటుంది. అయితే అది 3D యానిమేషన్ సినిమా. ఇషాన్ శుక్ల అనే 3D యానిమేషన్ డైరెక్టర్ దీనికోసం వర్క్ చేస్తున్నాడు. అతను కూడా కథకు కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. ఆల్రెడీ రెండున్నరేళ్లుగా ఆ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. 120 కోట్ల బడ్జెట్ తో బాహుబలి ఎటర్నల్ వార్ యానిమేషన్ సినిమా తెరకెక్కుతుంది. బాహుబలి వరల్డ్ ఇక్కడితో ఆగదు. మున్ముందు ఏదో ఒకరకంగా వస్తూనే ఉంటుంది అని తెలిపారు. అయితే బాహుబలి 3ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *