సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: తమిళ , తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడు, బాహుబలి కట్టప్పగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సీనియర్ సినీ నటుడు సత్యరాజ్‌కు కరోనా సోకిందని ఇటీవలే నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన పరీక్షల అనంతరం పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆసుపత్రిలో చేరినట్లు తాజా సమాచారం. ఆయన సొంతగా ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే గత శుక్రవారం రాత్రి ఒక్కసారిగా సత్యరాజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. చెన్నైలోని అమింజిక్కరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సత్యరాజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారట. సత్యరాజ్ ఆరోగ్యంపై తాజా అప్ డేట్ రావాల్సి ఉంది.
