సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటిన దర్శకధీరుడు, ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ లో పాన్ ఇండియా సూపర్ స్టార్ . ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్కాశెట్టి, రమ్యకృష్ణ, సత్యరాజ్ , సుదీప్ కీలక పాత్రధారులుగా ఆర్కా మీడియా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం గతంలో మొదటి ‘బాహుబలి- ధ బిగినింగ్’ 2015లో విడుదల కాగా, రెండోపార్టు ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ 2017లో విడుదలై ఇండియన్ సినిమా హిస్టరీ లో నెంబర్ 1 సినిమాగా సింహాసనం అధిష్టించాడు. ఈ రెండు చిత్రాలను కలిపి కాస్త నిడివి తగ్గించి ‘బాహుబలి: ద ఎపిక్’ పేరుతో మరోసారి రీరిలీజ్ లో అమోఘ విజయం అందుకొంటున్నాడు బాహుబలి.. సినిమా అందరు చూసారు కనుక కధ కొత్తగా చెప్పేదేముంది? సినిమా ఎలా కట్ చేసారో విశ్లేషిస్తే.. ఒక్క మాటలో నిజంగా ఈసారి మరో కొత్త సినిమా చూశామా ?అన్న అనుభూతి కలిగించేలా ఎడిటింగ్ చేసారు. ప్రథమార్థంలో మార్పు ఏమీ లేదు. రాజమాత చిన్న పిల్లాడిని కాపాడటం, మాహిష్మతి రాజ్యం కింద జీవించే పల్లెవాసులకు ఆ పిల్లాడు దొరకడం, అతడు శివుడుగా ఎదగడం, శివలింగాన్ని ఎత్తే సీన్, కొండెక్కి తమన్నాని చూస్తూ ధీవర సాంగ్ వరకూ ఎలాంటి కట్స్ లేకుండా చూపించారు. ఆ తర్వాత అవంతిక (తమన్నా)తో లవ్‌ట్రాక్‌ను రాజమౌళి వాయిస్ ఓవర్లో చెప్పారు.‘మమతల తల్లి’, ‘పచ్చబొట్టేసినా’, ‘మనోహరి..’ పాటలను కత్తిరించారు. కాలకేయులపై యుద్ధాన్ని కాస్త ట్రిమ్ చేశారు. శివుడు భద్ర (అడివి శేష్) తల నరకడం, శివుడే అమరేంద్ర బాహుబలి కొడుకని చెప్పడం, కట్టప్ప బాహుబలిని పొడవడంతో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియడానికి రెండేళ్ల సమయం అవసరం లేదని చెబుతూ ఇంటర్వెల్ వేశారు.బాహుబలి: ద కన్‌క్లూజన్’ను ద్వితీయార్థంగా తీసుకున్నారు. పాటలు తీసేసారు తప్ప అందులో కీలక సన్నివేశాలను ఏమాత్రం తొలగించలేదు. మొత్తం నాన్ స్టాప్ ఎమోషనల్ సీన్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. క్లైమాక్స్ పోరాటలను కాస్త కట్ చేశారు, ఇక టెక్నికల్‌గా విజువల్‌గా చిన్న చిన్న మార్పులు చేసినట్లు అనిపించింది. ఈ సినిమా అప్పటి కంటే ఇప్పుడు హై క్వాలిటీ సౌండింగ్ పరంగా, రీ రికార్డింగ్ పరంగా కీరవాణి సంగీతంతో సినిమా అద్భుతంగ ఉంది. సినిమా మధ్యలో బాహుబలి ప్రయాణం ఇంతటితో ఆగేది కాదు అంటూ ‘బాహుబలి-ఎటర్నల్ వార్ పార్ట్ 1’ అంటూ ఒక యానిమేషన్ ట్రెలర్ వేశారు. అది బాహుబలి అభిమానులకు మరో బోనస్ .
