సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ యూట్యూబర్, బిగ్బాస్ ఫేం షణ్ముఖ్ గంజాయితో పట్టుపడ్డాడు. ఏపీకి చెందిన ఓ యువతి తనను షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్ తనను 5 ఏళ్లుగా ప్రేమించి మోసం చేసాడని ఇప్పుడు 20 రోజులు క్రితం ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ని అదుపులోకి తీసుకునేందుకు తన ప్లాట్ కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి తీసుకొంటూ కనిపించాడు. దీనితో సోదరులను ఇద్దరినీ అరెస్ట్ చేసి పోలీసులు 2 రకాలయిన కేసులలో విచారణ చేస్తున్నారు.
