సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్టార్ మా చేనెల్ లో ప్రసారమౌతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో 105 రోజుల చివరి భాగం నేటి ఆదివారం రాత్రి 7గంటల నుండి ప్రసారమౌతోంది. ఈ ఫైనల్ ఎపిసోడ్ లో గ్రాండ్ పైనల్ కి చేరిన టాప్ 6 ఇంటి సభ్యులు లో ఒకరిని విజేతగా ప్రకటిస్తారు. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం రైతు బిడ్డ’ పల్లవి ప్రశాంత్ విజేత అయ్యాడని వినికిడి.. ఇక తాజాగా గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ప్రోమో నేడు, విడుదల అయ్యింది. ప్రోమో చూస్తే స్టార్లతో సందడి మాములుగా లేదు. గ్రాండ్ ఫినాలేలో స్టేజి మీద ఐదుగురు హీరోలు సందడి చేశారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిన కంటెస్టెంట్స్ అందరూ బిగ్బాస్ షో.. తమ జీవితాలను మార్చేసిందని అనుభవాలను చెపుతున్నారు. . మాస్ మహారాజా రవితేజ హీరోగా సంక్రాంతికి విడుదల కానున్న ‘ఈగల్’ చిత్రాన్ని ‘బిగ్ బాస్ 7’ ఫినాలేలో ప్రమోట్ చేశారు. నాగార్జున హీరోగా నటిస్తున్న ‘నా సామి రంగ’ సినిమాలో కీలక పాత్రధారులు అయిన అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సైతం సందడి చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘డెవిల్’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ చిత్ర బృందం కూడా సినిమా ప్రమోషన్లో భాగంగా బిగ్బాస్ వేదికపై కనిపించారు. సుమ కనకాల తనయుడు రోషన్ నటించిన ‘బబుల్ గమ్’ సినిమా టీమ్ కూడా పాల్గొంది, యాంకర్ సుమ కాసేపు సందడి చేసింది. నాగార్జున కూడా సుమని ఓ ఆట ఆడుకున్నారు. మరి ప్రచారంలో ఉన్నట్లు ముఖ్య అతిధిగా మహేష్ బాబు వచ్చారో? లేరో?
