సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచంలో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు బిగ్ బాస్ అంటే నాగార్జునే గుర్తుకువస్తారు. మొదటి ఎపిసోడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టిన, తరువాత నాని హోస్టింగ్ చెయ్యలేక బెదిరిపోయిన సరే.. ఇప్పటి వరకు వచ్చిన 8 సీజన్ లలో 6 సీజన్లలో చేసిన నాగార్జున స్టైల్ దానికి బ్రాండ్ అయిపొయింది. అయితే రానురాను బిగ్ బాస్ హౌస్ లో ఉండటానికి సెలబ్రెటీలు భయపడుతుండటం తో నాసిరకం గా ఎవరుబడితే వారు వచ్చేసి చేసే చీప్ సందడి తో తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకులలో హోదా బాగా పడిపోయింది. హోస్ట్ గా నాగార్జున సైతం కొన్ని చెత్త ఆటలు ఆడించడం, కొందరికి వంత పడుతూ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మరల సర్దుకోవడం చూసేవారికి ఇబ్బందిగానే ఉంది. మొత్తానికి గత స్థాయి క్రేజ్ బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ కు ఆపాదించడానికి హోస్ట్ ను మార్చాలని నిర్వాహకులు ఇప్పటికే ఆన్ స్టాప్ బుల్ తో హోస్ట్ గా దుమ్ము లేపిన బాలయ్యను సంప్రదించారని చర్చలు ఫలించి త్వరలో అయన హోస్ట్ గా బిగ్ బాస్ 9 వ సీజన్ ప్రారంభ సూచనలు ఉన్నట్లు సమాచారం. బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షో విజయం సాధించడంతో అక్కడ వర్క్ చేసిన రైటింగ్ టీమ్, బాలయ్యకు సహకరించిన టీమ్ ను ఇక్కడ కూడా కొనసాగిస్తారని వార్తలు వస్తున్నాయి.అఖండ 2 సినిమా షూటింగ్ పూర్తీ అయ్యాక బాల్లయ్య ఆగమనంపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *