సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగు బిగ్ బాస్ 5 గత ఆదివారం రాత్రి ముగిసిన నేపథ్యంలో బిగ్‌బాస్ షో విజేతగా అరుణ్ రెడ్డి (సన్నీ) విజేతగా నిలిచారు. హోస్ట్ నాగార్జున చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోపిని, 50 లక్షల ఫ్రెజ్ చెక్, టీవీ ఎస్ బైక్, ఇంటి ఫ్లాట్ బహుమతులు అందుకొన్నాడు. షణ్ముఖ్ 2వ స్థానంలో నిలిచాడు. తెలుగు రాష్ట్రాలలో అనేక లక్షల మంది ఈ గ్రాండ్ ఫైనల్ లో విజేతగా సన్నీ గెలవాలని కోరుకొంటూ ఆసక్తిగా చూశారు. గెలిచాక పలుచోట్ల అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా గత రాత్రి సన్నీ హైదేరాబద్ నగర వీధులలో ఊరేగుతూ వేలాది అభిమానులకు అభివాదాలు చేస్తూ సందడి చేసారు. అతడి మిత్రులు పలువురు కేరింతలు కొట్టారు. విన్నర్ సన్నీ..అంటూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
