సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్టార్ మా ఛానెల్ లో నేటి ఆదివారం (సెప్టెంబర్ 3 న) “బిగ్ బాస్ 7వ సీజన్’ గ్రాండ్ గా లంచ్ కాబోతుంది.గతంలో ఆరు సీజన్స్ ముగించుకుని ఏడో సీజన్ ఆ రోజున రాత్రి 7 గంటలకు అక్కినేని నాగార్జున హోస్టుగా ప్రారంభిస్తున్నారు. గత సీజన్ లలో ‘బిగ్ బాస్” క్రేజ్ కోల్పోతున్న నేపథ్యంలో ఈసారి గతానికి బిన్నంగా ఉల్టా పల్టా అంటూ ఉహించనవి జరుగుతాయి.. అంటూ ప్రేక్షకులు అందరికీ ఒక సరికొత్త లోకాన్ని పరిచయం చేసేం దుకు ఏర్పాటు చేసినట్లు ప్రోమోస్ చుస్తే అర్ధం అవుతుంది. ఇక నుండి స్టార్ మా లో ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9. 30 గంటలకు మరియు ప్రతి శనివారం , ఆదివారం రాత్రి 9 గంటలకు చూడవచ్చు . డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రం 24X7 స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ సారి హౌస్ లోకి వివాదాస్వాద నటులు , హీరో శివాజీ, టివి స్టార్ ప్రభాకర్, బులెట్ భాస్కర్ వంటి ప్రముఖులు వస్తారని భావిస్తున్నారు. ఎవరు ఉంటారో ఈ రాత్రికి చూడవచ్చు..
