సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే సెప్టెంబర్ 2న భీమవరం వస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పర్యటనను ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శిలు కలిదిండి వినోద్ వర్మ, తోట గంగరాజు, మరియు ఆకుల లీలా కృష్ణమూర్తి,కే. సురేంద్ర, తదితర నేతలు కోరారు. భీమవరంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటన ఏర్పాట్లను స్థానిక బిజెపి నాయకులు తో కలసి పరిశీలించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ వర్మ మాట్లాడుతూ.. సుమారు 5వేల మంది సారధ్యం యాత్రలో పాల్గొంటారని, సెప్టెంబర్ 2 తేదీన ఉదయం చాయ్ పే చర్చ, ఉదయం 10 గంటలకు మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి ప్రారంభమై వెంకటరామ థియేటర్ రోడ్డు, ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్ మీదుగా ఆనంద ఫంక్షన్ హాల్ వరకు భారీ ఎత్తున నిర్వహించే శోభాయాత్రలో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొంటారని అన్నారు. మధ్యాహ్నం ఆనంద ఫంక్షన్ హాల్ లో జరిగే జిల్లా విస్తృతస్థాయి బిజెపి కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా మాధవ్ పాల్గొని ప్రసంగిస్తారని వినోద్ వర్మ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *