సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం అమరావతిలో రాష్ట్ర సచివాలయం వద్ద మొదటి గేటు వద్ద నిలబడి గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్‌ను( bil gates ) ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu ) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan ) ఆహ్వానించారు. ఆపై రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) సేవలను బిల్ గేట్స్ పరిశీలించారు.ఆపై బిల్ గేట్స్ సహా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై సమావేశంలో చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మెడ్ టెక్, డయాగ్నస్టిక్స్ సేవలు, సాంకేతిక సాగు సహా తదితర ప్రాజెక్టుల గురించి వివరించనున్నారు సీఎం, అధికారులు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి సర్కార్ వివరించనుంది.ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు,నిమ్మల రామానాయుడుఇతర మంత్రులు హాజరయ్యారు. అలాగే, వివిధ శాఖల విభాగాధిపతులు వర్చువల్‌గా సమావేశానికి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *