సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ప్రపంచ దిగ్గజం మైక్రోసాఫ్టు వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ భారతదేశంలో పర్యటిస్తున్నానేపథ్యంలో నేడు, బుధవారం పార్లమెంట్‌ ఆఫీస్ లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఇదే నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, నారా చంద్రబాబు కేంద్ర మంత్రి,భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలసి బిల్‌గేట్స్‌తో సమావేశం అయ్యారు. ( శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను, ప్రసాదాన్ని వారు బిల్ గేట్స్ కు జ్ఞపైకగా ఇచ్చారు.. ఫై ఫొటోలో) ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఏపీలో హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయంపై బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. బిల్ గేట్స్‌ను అమరావతి, తిరుపతికి రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. అందుకు బిల్‌గేట్స్ అంగీకరించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ.. : గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ ప్రభుత్వం చేసుకున్న కీలక ఒప్పందాలు రాష్ట్ర పురోగతికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగ ఉపాధి కల్పన తదితర కీలక రంగాల్లో సేవలను మెరుగుపర్చడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతల వినియోగానికి ఉన్న అవకాశాలపైన కీలక చర్చలు జరిగాయని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి మద్దతుగా బిల్ గేట్స్ ముందుకు వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *