సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో భవిషత్తు రాజకీయాలను దేశప్రజల ఆలోచనలను ప్రభావితం చేస్తుందని భావిస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు, గురువారం సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రెస్ మీట్ లో రెండు విడతలుగా బిహార్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. బీహార్ లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఓటర్ల జాబితాలో సవరణలకు ఇంకా అవకాశం ఉందనీ ఆయన పేర్కొన్నారు. వచ్చే నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్‌ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బిహార్ రాష్ట్రంలో రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. నవంబర్‌ 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. దీంతోపాటు, జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక కూడా నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *