సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలో గత 2 ఏళ్లుగా పలుమారులు ఏదోరోజు జరుగుతుంది.. అని భావిస్తున్న ఘటన నేడు జరిగింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నేటి శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసిన ఈడీ.. ఢిల్లీకి తరలిస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కవిత ఇంట్లో ఈడీ అధికారులు ఆమెను విచారించారు. ఈడీ అనుమతితో కవిత ఇంట్లోకి వెళ్లిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు మోడీ …కేడి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో రచ్చ రచ్చ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ. నేటి సాయంత్రం చీకటి పడ్డాక ఢిల్లీకి తరలిస్తోంది. ఇదిగో అరెస్ట్ వారంట్ అంటూ అధికారులు నోటీసులు చూపించడం.. యాక్ట్‌కు సంబంధించిన వివరాలన్నీ చెప్పిన తర్వాత పరిస్థితి కాసింత అదుపులోనికి వచ్చింది. దీంతో ఢిల్లీకి కవితను ఈడీ బృందం తరలిస్తోంది. కవిత.. ఇంట్లోనుంచి బయటికి వస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు, అభిమానులు నినాదాలు, ఈలలు, కేకలతో హోరెత్తించారు. దీంతో ఈ అరెస్ట్ వ్యవహారంపై కవిత పార్టీ క్యాడర్ నుద్దేశిస్తూ.. .ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగిన ఎదుర్కొంటాం, బీఆర్ఎస్ శ్రేణులు బలంగా మనోదైర్యంతో ఉండాలని తక్కువగా మాట్లాడి వారిని సముదాయిస్తూ.. అరెస్ట్ తర్వాత కారులో వెళ్తూ పార్టీ శ్రేణులకు అభివాదం చేసారు కవిత.
